 
                                        సీతారామం వంటి క్లాసిక్ సినిమాలో దుల్కర్ సల్మాన్కి జోడీగా నటించిన మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రజల మనసులు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమె వరుస సినిమాలతో చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ (వయసులో ఉంటే ప్రేమ తప్పదు) అనే సినిమాలో నటిస్తున్నారు.
డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్‌కి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలీ సాగర్, రాకేశ్ బేడీ, మనీష్ పాల్, చుంకీ పాండే, కుబ్బ్రా సాయత్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావలసి ఉండగా అనివార్య కారణాల వలన 2026, జూన్ 5న విడుదల కాబోతోంది.