విజయేందర్ దర్శకత్వంలో ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం రాగ్ మయూర్, విష్ణు ఓఐ, ప్రసాద్ బేహార ప్రధాన పాత్రలలో మిత్రమండలి హడావుడి అప్పుడే మొదలైంది. ఇది పూర్తి కామెడీ సినిమా అయినప్పటికీ దీనికి సెన్సార్ బోర్డు యూట్యూబ్‌లో/ఏ సర్టిఫికేట్ జారీ చేయడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈ సినిమాకు సంగీతం: ఆర్‌ఆర్ ధ్రువన్, కెమెరా: సిద్ధార్థ్ ఎస్‌జె, కొరియోగ్రఫీ: మొయిన్, ఎడిటింగ్: పీకే, ఆర్ట్: గాంధీ నడికుడికర్ చేశారు.
సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి తీగల కలిసి నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.