రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మొదలుపెడుతున్న ‘రౌడీ జనార్ధన’ సినిమాకు నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో దీనిని నిర్మిస్తున్నారు. ‘రౌడీ జనార్ధన’కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో డా.రాజశేఖర్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 16 నుంచి ముంబాయిలో ‘రౌడీ జనార్ధన’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
కీర్తి సురేష్ గత ఏడాది పెళ్ళి చేసుకొని ఈ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుండగా, విజయ్ దేవరకొండ, రష్మిక మందనతో ఇటీవల వివాహ నిశ్చితార్ధం చేసుకున్నాక ఈ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారు పెళ్ళి చేసుకోబోతున్నట్లు సమాచారం. కనుక వారి పెళ్ళికి ముందో తర్వాతో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.