తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పాల్గొనే ప్రముఖులు వీరే

December 07, 2025


img

సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా జరుగబోతోంది. ఫ్యూచర్ సిటీగా పేర్కొంటున్న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌ పేటలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఈ సదస్సు జరుగబోతోంది. దీనిలో దేశవిదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఆ ప్రముఖులు వీరే... 

ఒలింపిక్ అవార్డ్ విన్నర్: బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు,

మాజీ క్రీడాకారులు: అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా సుఖేందర్ రెడ్డి,

క్రియేటివ్ సెషన్‌లో పాల్గొనబోయే సినీ ప్రముఖులు: దర్శకులు  రాజమౌళి, సుకుమార్, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్, గుణీత్ మోంగా, అనుపమ చోప్రా, 

నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త: అభిజిత్ బెనర్జీ

 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత: కైలాష్ సత్యార్థి 

బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్: కిరణ్ మజుందార్-షా

 ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్ సీఈఓ: ఎరిక్ స్వైడర్

వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో: జెరెమీ జుర్గెన్స్. 

పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలో పారిశ్రామిక దిగ్గజాలు, ఐటి కంపెనీల సీఈవోలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సదస్సుకి పలువురు ప్రముఖులు వస్తున్నందున భారీగా పోలీసులు మొహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


Related Post