డ్రాగన్‌లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్స్... అదుర్స్!

December 07, 2025


img

జూ.ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇద్దరూ సైలంట్‌గా డ్రాగన్ చేసుకుపోతున్నారు. బహుశః ఈ నెల 25న క్రిస్మస్ పండగకి ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఇస్తారేమో చూడాలి. ఈలోగా జూ.ఎన్టీఆర్‌ తాజా ఫోటో ఒకటి అభిమానులతో షేర్ చేసుకున్నారు. అది చూసి అభిమానులు సూపర్ అంటూ ప్రశంశలు కురిపిస్తున్నారు. 

జూ.ఎన్టీఆర్‌ ఇటీవల ఓ వాణిజ్య ప్రకటన చేస్తున్నప్పుడు గాయపడటంతో డ్రాగన్ షూటింగ్‌ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో రేపటి నుంచి మళ్ళీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ముఖ్యమైన సీన్స్ అన్నీ షూట్ చేసేశారు. రేపటి నుంచి ప్రారంభం కాబోయే షెడ్యూల్లో సినిమా క్లైమాక్స్ కోసం ఓ భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.  

ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష