శనివారం రాత్రి గోవాలోని అర్పోరాలో గల ఓ నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దానిలో 25 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు క్లబ్‌లో ఓ డాన్సర్ డాన్స్ చేస్తుండగా చుట్టూ మ్యూజిషియన్స్ వాయిద్యాలు వాయిస్తున్నారు. ఆ సమయంలో క్లబ్‌లో చాలా మంది ఉన్నట్లు అరుపులు, ఈలలతో స్పష్టమయ్యింది.
అక్కడ డాన్స్ షో జరుగుతుండగా వారి వెనుక వేదికపై ఓ పరదాకు మంటలు అంటుకున్నాయి. అప్పుడు అందరూ మంటలు అంటుకున్నాయని గట్టిగా అరవడంతో డాన్సర్, మ్యూజిషియన్స్ అందరూ ప్రోగ్రాం మద్యలో ఆపేసి తాపీగా బయటకు నడుచుకుపోయారు. కానీ ఈ అగ్నిప్రమాదంలో 25 మంది చనిపోవడం పెద్ద షాక్.
ఇవన్నీ అక్కడున్నవారిలో ఎవరో తమ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నైట్ క్లబ్ కిచెన్‌లో గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో మంటలు మొదలై అంతటా వ్యాపించినట్లు తెలుస్తోంది. కానీ గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వలననే ఎక్కువ ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ వీడియో వైరల్ ఆవుతోంది.
గోవా అగ్నిప్రమాదం.. మంటలు ఎలా అంటున్నాయో చూడండి
గోవాలోని అర్పోరాలో ఉన్న నైట్ క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ స్టేజ్ షో జరుగుతున్న క్రమంలో ఆ స్టేజీపై ఉన్న పరదాకు నిప్పు అంటుకుంది. అలా చిన్నగా… pic.twitter.com/nu3cnIGsz6