వరలక్ష్మి శరత్ కుమార్‌ పోలీస్ కంప్లైంట్ దేనికంటే...

December 06, 2025


img

వరలక్ష్మి శరత్ కుమార్‌ ‘పోలీస్ కంప్లైంట్’ ఇవ్వలేదు. అది ఆమె, నవీన్ చంద్ర కలిసి నటించిన సినిమా పేరు. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో ఎంఎస్‌కె ప్రమిదశ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హర్రర్-థ్రిల్లర్ జోనర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమా ‘కర్మకు ప్రతికర్మల చైన్ రియాక్షన్స్’ అనే కాన్సెప్ట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవి శంకర్, ఆదిత్య ఓం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణపై ఓ ప్రత్యేక పాట ఉంటుందని అది ఈ సినిమాకే హైలైట్ అవుతుందని చిత్ర బృందం చెపుతోంది. త్వరలోనే సినిమా పాటలు, టీజర్‌, ట్రైలర్‌లతో ప్రమోషన్స్‌ మొదలుపెడతామని తెలిపింది. 


Related Post

సినిమా స‌మీక్ష