జీ5లోకి కిష్కిందపురి ఎప్పటి నుంచంటే....

October 10, 2025


img

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్‌ జోడీగా చేసిన ‘కిష్కిందపురి’ సెప్టెంబర్‌ 12న థియేటర్లలో విడుదలై పరవాలేదనిపించుకుంది. ఇప్పుడీ సినిమా ఈ నెల 17 నుంచి జీ5లోకి రాబోతోంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం అవుతుందని, ఈ నెల 19 నుంచి జీ5 ఛానల్లో ప్రసారం అవుతుందని ఆ సంస్థ ప్రకటించింది. 

దెయ్యాలతో వ్యాపారం కూడా చేయవచ్చనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా మొదలుపెట్టినప్పటికీ, హీరో బృందం సువర్ణ మాయ అనే ఓ పాడుబడిన రేడియో స్టేషన్లో నివాసం ఉంటున్న దెయ్యంతో పడిన తిప్పలే ఈ సినిమా.      

షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కౌశిక్ పెగళ్ళపాటి, కెమెరా: చిన్మయ్ సలాస్కర్, సంగీతం: శామ్ సీఎస్, చైతన్ భారద్వాజ్, ఆర్ట్: శివ కామేష్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే, అడిషనల్ స్కీన్‌ ప్లే: బాల గణేష్ చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష