విజయ్ దేవరకొండ, దిల్ రాజు కలిసి ఇదివరకు పరశురాం దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేశారు. కానీ అది పెద్దగా ఆడలేదు. మళ్ళీ ఇంతకాలం తర్వాత వారిద్దరూ కలిసి మరో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నారు.
ఈసారి రవికిరణ్ కోలా దర్శకత్వంలో యాక్షన్ చిత్రం చేయబోతున్నారని దిల్ రాజు తెలిపారు. ఈ సినిమాకు ‘రౌడీ జనార్ధన్’ అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 16 నుంచే ముంబాయిలో మొదటి షెడ్యూల్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా కీర్తి సురేష్ నటించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమా ప్రకటనతో పాటు నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు.