పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు వాటి తీరే వేరు. అలాగే చిన్న సినిమాల తీరే వేరు. చక్కటి కధ, కధనాలతో ఇప్పుడు అనేక చిన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. అటువంటిదే శ్రీ చిదంబరం కూడా.
మెల్లకన్ను ఉందని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని తిరిగే ఓ యువకుడు ప్రేమలో పడతాడు. మెల్లకన్ను లోకానికి చాలా చిన్న సమస్య కావచ్చు. కానీ ఆ సమస్యతో బాధపడుతున్నవారికే ఆ కష్టం ఏమిటో తెలుసు. ఇటువంటి సమస్యని గ్రామీణ నేపధ్యంలో ప్రేమ కధతో ముడిపెట్టి శ్రీ చిదంబరం సినిమాతో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు వినయ్ రత్నం.
వంశి తిరుమల, సంధ్య వశిష్ఠ ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమా టీజర్ చూస్తే ఇది అందరినీ అలరించే మరో మంచి సినిమాగా నిలుస్తుందని అర్ధమవుతుంది.
ఈ సినిమాలో గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మొర్రం, శంకర్ రావు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వంశి తిరుమల; సంగీతం: చందు రవి, కెమెరా: అక్షయ్ రామ్ పొడిశెట్టి; ఆర్ట్: విష్ణు వర్ధన్ పుల్ల; ఎడిటింగ్: అన్వర్ అలీ చేశారు. ఈ చింతా వినీష రెడ్డి, చింత గోపాలకృష్ణ రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.