విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ ప్రారంభమైందని తెలియజేస్తూ నిర్మాత నాగావంశీ వారిద్దరి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ సినిమాలు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకుడుగా మారి జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి పలువురుకి హిట్స్ అందించారు. వెంకటేష్, త్రివిక్రమ్ ఇద్దరికీ మంచి కామెడీతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయగలరనే పేరుంది. కనుక వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి.
ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా త్రిష, నిధి అగర్వాల్, రుక్మిణీ వసంత్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.