అమెజాన్ ప్రైమ్‌ టీవీలో పరమ్‌ సుందరి...

October 10, 2025


img

ప్రముఖ బాలీవుడ్‌ నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్‌ జంటగా చేసిన ‘పరమ్‌ సుందరి’ అమెజాన్ ప్రైమ్‌ టీవీ ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. కానీ ప్రస్తుతం ఈ సినిమా చూడాలనుకుంటే రూ.349 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. 

క్లుప్తంగా ఈ సినిమా కధ... ఢిల్లీకి చెందిన కోటీశ్వరుడి కొడుకు పరమ్‌ (సిద్ధార్థ్ మల్హోత్రా) ‘ఫైండ్ మై సోల్ మేట్’ అనే ఓ డేటింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటాడు. కానీ తండ్రి విధించిన షరతు మేరకు కేరళ వెళ్ళి ఓ ఇంట్లో అద్దెకు దిగుతాడు.

అక్కడ సుందరి (జాన్వీ కపూర్‌)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. తర్వాత డేటింగ్ యాప్, పెట్టుబడి, తండ్రి షరతు గురించి ఆమెకు చెప్పినపుడు ఆమె దూరం అవుతుంది. తర్వాత ఆమె అతని ప్రేమను అంగీకరించిందా లేదా? అతనికి పెట్టుబడికి తండ్రి డబ్బు ఇచ్చాడా? లేదా అనేది మిగిలిన స్టోరీ. 

బాలీవుడ్‌ సినిమా కధని కేరళలో తీస్తే సూపర్ హిట్ అవుతుందనుకుంటే మిశ్రమ స్పందన వచ్చింది. చూడాలనుకుంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌ టీవీలో అందుబాటులో ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష