ఈ నెలాఖరుకి ఉస్తాద్ షూటింగ్ ఫినిష్: రవిశంకర్

October 10, 2025


img

పవన్‌ కళ్యాణ్‌ ఓజీ తర్వాత వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ యలమంచిలి తాజా ఇంటర్వ్యూలో ఉస్తాద్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ చేయాల్సిన పార్ట్ షూటింగ్ పూర్తయిపోయింది.

నేటి నుంచి మిగిలినవారితో చేయాల్సిన సన్నివేశాలను దర్శకుడు హరీష్ శంకర్ షూటింగ్ చేస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. దానిని బట్టి సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో నిర్ణయించుకుంటాము. కానీ ఖచ్చితంగా సరైన సమయంలోనే రిలీజ్ చేస్తాము,” అని చెప్పారు.        

మైత్రీ పాన్ ఇండియా మూవీ మేకర్స్ బ్యానర్‌పైనే జూ.ఎన్టీఆర్‌ నటిస్తున్న డ్రాగన్ కూడా తీస్తుండటంతో ఆ సినిమా గురించి ప్రోగ్రస్ గురించి మీడియా మిత్రులు అడిగిన మరో ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఈ నెలాఖరు నుంచి తర్వాత షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలళ వరకు మద్యలో ఆపకుండా షూటింగ్‌ జరుగుతుంది,” అని నిర్మాత రవిశంకర్ యలమంచిలి చెప్పారు. 


Related Post

సినిమా స‌మీక్ష