డిజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

October 10, 2025


img

కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో దేశవ్యాప్తంగా మావోయిస్టులను ఏరివేస్తుండటంతో వారికి రెండే మార్గాలు మిగిలాయి. లొంగిపోవడం లేదా భద్రతాదళాలతో పోరాడుతూ ప్రాణాలు పోగొట్టుకోవడం. కొంతమంది పోరాడి ప్రాణాలు పోగొట్టుకుంటుంటే చాలా మంది మావోయిస్టులు పోలీసులకు ఆయుధాలు సమర్పించి బేషరతుగా లొంగిపోతున్నారు. 

శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచర్ల వెంకటరాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ సోనీ పోలీసులకు లొంగిపోయారు.

వీరు ముగ్గురూ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు. వీరిలో కుంకటి వెంకటయ్య సిద్ధిపేట జిల్లాకు చెందినవారు కాగా, మొగిలిచర్ల వెంకట రాజు  హనుమకొండ జిల్లా ధర్మాసాగారం మండలంలోని తాటికాయల గ్రామానికి చెందినవారు.

అయన భార్యే తోడెం గంగ. ముగ్గురూ నేడు పోలీసులకు లొంగిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 403 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. 


Related Post