ఛలో బస్ భవన్‌: సిటీ బస్సులో హరీష్ రావు

October 09, 2025


img

టీజీఎస్ ఆర్టీసీ సిటీ బస్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ బీఆర్ఎస్‌ పార్టీ నేడు ‘ఛలో బస్ భవన్‌’కి పిలుపునిచ్చింది. దీనిలో పాల్గొనేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు సిటీ బస్సులో ప్రయాణించారు.

ఈ సందర్భంగా అయన ప్రయాణికులతో మాట్లాడుతూ, “మెహిదీపట్నం నుంచి  బస్ భవన్‌కి మొన్నటి వరకు టికెట్ చార్జి రూ.30 ఉండేది. ఇప్పుడు అది రూ.40కి పెరిగింది. అంటే రానూపోనూ రోజుకి రూ.20 చొప్పున నెలకు రూ.600 భారం పేద, మధ్యతరగతి ప్రజలపై ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది.

ఓ పక్క మహాలక్ష్మి పధకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెపుతూ, మళ్ళీ ఈ విదంగా ఛార్జీలు పెంచి ప్రజల నుంచి ఆ డబ్బువెనక్కు తీసుకోవడం చాలా దుర్మార్గపు ఆలోచనే కదా? దీనిని మేము ఖండిస్తున్నాము...” అంటూ హరీష్ రావు అన్నారు. అయన ఏమన్నారో ఆయన మాటల్లోనే....        


Related Post