అమెజాన్ ప్రైమ్‌ టీవీలో బకాసుర రెస్టారెంట్

October 09, 2025


img

ప్రవీణ్, వైవా హర్ష, షైనింగ్ ఫణి, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రలు చేసిన ‘భకాసుర రెస్టారెంట్’ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ నెలలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌ టీవీ ఓటీటీలోకి కూడా వచ్చి అప్పుడే చాలా రోజులైంది. ఇంతకీ విషయం ఏమిటంటే వందల కోట్లు బడ్జెట్‌ పెట్టి తీసిన కన్నప్పతో సహా కూలి, పరదా వంటి సినిమాలతో పోటీ పడుతూ ఓటీటీలో కూడా 250 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.  

ఓ బిజినెస్ కోసం తాంత్రిక పుస్తకంలో వ్రాసినట్లు చేస్తే ఓ ఆత్మ హీరో పరమేశ్వర్ (ప్రవీణ్) ఫ్రెండ్ అంజిబాబుని   ఆవహిస్తుంది. ట్విస్ట్ ఏమిటంటే ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. అల్లరి దెయ్యాలు, భయపెట్టే దెయ్యాలను చూశాం కానీ ఆకలి దెయ్యాన్ని ఎన్నడూ చూడలేదు. బకాసుర రెస్టారెంట్‌లో తొలిసారిగా ఆకలి దెయ్యాన్ని కూడా పరిచయం చేశారు.   

ఆ దెయ్యం ఆకలిని తీర్చడానికి వారు ఏం చేశారు? తమ స్నేహితుడిని ఆవహించిన ఆత్మ తమకు తెలిసిన బక్క సూరిదని తెలుసుకున్న వారు దానిని ఏవిదంగా వదిలించుకుంటారు?దాని కోసం వారు ఏం చేశారనేది అమెజాన్ ప్రైమ్‌ టీవీలో సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.     

చినవారి ఆకలి తీర్చడానికి హీరో బృందం పడే తిప్పలు, దెయ్యాలు, ఆత్మల కధలే ఈ సినిమా అని ట్రైలర్‌తో చెప్పేశారు దర్శకుడు ఎస్‌ జె శివ. ఈ సినిమాతో ఆయన  దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. 

ఈ సినిమాకు కధ: వినయ్ కొట్టి, సహ రచయిత: సాయి దామరి, సంగీతం: వికాస్ బడిస, కెమెరా: భద్రతా దళాలు సరస్వతి, ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్ చేశారు.   

ఎస్ జె మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి కలిసి బకాసుర రెస్టారెంట్ ఓపెన్ చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష