కె ర్యాంప్ టీజర్‌ చూశాం ఇక రేపు ట్రైలర్‌… ఎలా ఉంటుందో?

October 09, 2025


img

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా చేసిన ‘కె-ర్యాంప్’ టీజర్‌ కిందట శుక్రవారం విడుదలైంది. టీజర్‌లో డబుల్ మీనింగ్ డైలాగులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక ట్రైలర్‌, సినిమా ఇంకెలా ఉంటుందో?అని సందేహం కలుగక మానదు.

రేపు (శుక్రవారం) ఉదయం 11.07 గంటలకు ట్రైలర్‌ విడుదల కాబోతోంది. అది కూడా టీజర్‌లాగే ఉన్నట్లయితే, వాటిని ఎక్కువ ఇష్టపడేవారు థియేటర్లకు వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు.  

ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, సాయి కుమార్‌, చంద్రిక రవి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: జైన్స్ నాని, సంగీతం: చేతన్ భరద్వాజ, కెమెరా: సతీష్ రెడ్డి మాసం, ఆర్ట్: సుధీర్ మాచర్ల, ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్ చేశారు. 

హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాతలు బాలాజీ గుట్ట, ప్రభాకర్ బురుగు. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష