పెద్ద సినిమాలు బోర్లా పడుతుంటే....

September 24, 2025
img

పెద్ద హీరోల భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా మూవీలు విడుదలయ్యే సమయంలో చిన్న సినిమాలు కూడా విడుదలవుతుండటం యాదృచ్చికమే కావచ్చు. కానీ పెద్ద సినిమాలు బోర్లా పడినప్పుడు చిన్న సినిమాలు సూపర్ హిట్ అవుతుండటం మాత్రం యాదృచ్చికం కానే కాదు. 

భారీ అంచనాలతో విడుదలైన ‘ఆదిపురుష్’ బోర్లా పడగా చిన్న సినిమా అనుకున్న ‘హనుమాన్’ సూపర్ హిట్ అయ్యింది. హరిహర వీరమల్లు సినిమా తడబడితే మహావతార్ నరసింహ యానిమేషన్ మూవీ రూ.300 కోట్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టింది.

ఇప్పుడు ఓజీ చాలా భారీ అంచనాలతో విడుదల కాబోతోంది. హరిహర వీరమల్లు నిరాశ పరచడంతో అభిమానులు దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ పూర్తి యాక్షన్ సినిమా అయిన ‘ఓజీ’ ప్రేక్షకులను మెప్పించగలదా లేదా? అనే భయాలు కనిపిస్తూనే ఉన్నాయి.

ఇదే సమయంలో తేజ సజ్జా చేసిన ‘మిరాయ్’ కేవలం 12 రోజులలోనే రూ.140 కోట్ల కలక్షన్స్ సాధించి ఇంకా దూసుకుపోతోంది. అక్టోబర్ 2న కాంతార ఛాప్టర్: 1 విడుదల కాబోతోంది. కాంతారా సూపర్ హిట్ అయినందున దీనిపై చాలా భారీ అంచనాలున్నాయి. ట్రైలర్‌ చూస్తే తప్పకుండా హిట్ అవుతుందనే అనిపిస్తోంది. 

కనుక రేపు విడుదల కాబోతున్న ‘ఓజీ’ సూపర్ హిట్ అవుతుందా లేదా? ఈ చిన్న సినిమాల రికార్డులు
బద్దలు కొడుతుందా లేదా? కొన్ని గంటలలోనే తెలుస్తుంది. 

Related Post