రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో చేసిన ‘కాంతార ఛాప్టర్ 1’ ట్రైలర్ సోమవారం విడుదలైంది. ట్రైలర్ మహాద్భుతంగా ఉంది. ఈ సినిమాతో రిషబ్ శెట్టి మరోసారి సూపర్ హిట్ కొట్టబోతున్నట్లు ట్రైలర్‌తోనే అర్ధమవుతోంది. కాంతార: ఛాప్టర్ 1 అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈసారి ఈ సినిమాని బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాలో రిషబ్ శెట్టికి జంటగా రుక్మిణీ వసంత్ నటించగా జయరాం, రాకేశ్ పూజారి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రిషబ్ శెట్టి; సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్; సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్ చేశారు.