ఈరోజు సాయంత్రమే సొగసు చూడతరమా... తెలుసు కదా?

September 23, 2025


img

సిద్దు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా,  శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా చేసిన ‘తెలుసు కదా?’ నుంచి సొగసు చూడతరమా పాట ఈ రోజు ఉదయం 11.07 గంటలకు విడుదల కావలసి ఉంది. కానీ అనివార్య కారణాల వలన వాయిదా పడింది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు నయనతార డిజిటల్ రిలీజ్ చేస్తారని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలియజేసింది. 

కృష్ణ కాంత్ వ్రాసిన ఈ పాటని తమన్ స్వరపరిచి సంగీతం అందించగా కార్తీక్, అద్వితీయ కలిసి పాడారు. ఈ సినిమాలో హర్ష చెముడు హీరో స్నేహితుడుగా నటించారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: నీరజ్ కోనా;  సంగీతం: థమన్; కెమెరా: జ్ఞాన శేఖర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలవబోతోంది... తెలుసు కదా?         


Related Post

సినిమా స‌మీక్ష