ఓజీ.... ట్రైలర్‌ కాస్త ఆలస్యం కానీ ఈరోజే... పక్కా!

September 21, 2025


img

సుజీత్-పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో  ఈ నెల 25న ‘ఓజీ’ విడుదల కాబోతోంది. కనుక ఈ రోజు (ఆదివారం) ఉదయం 10.08 గంటలకు ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లు సుజీత్ ప్రకటించారు. కానీ గంటలు గడుస్తున్నా ట్రైలర్‌ విడుదల చేయకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనంగా ఉన్నారు.

ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరుగబోయే ఓజీ  కన్సర్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ విడుదల చేస్తామని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. 

ఈరోజు ఉదయం నుంచే ఎల్బీ స్టేడియం అభిమానుల కోలాహలంతో చాలా సందడిగా మారింది. మరికొద్ది సేపటిలో పవన్‌ కళ్యాణ్‌తో సహా చిత్ర బృందం అక్కడకు చేరుకాగానే ఈ కార్యక్రమం మొదలవుతుంది. 

ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా ప్రియాంక మోహన్ నటించగా, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్‌ ఉత్తమన్, అభిమన్యు సింగ్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష