అరకులో ఎయిర్ బెలూన్ రైడ్

September 21, 2025
img

పొరుగు రాష్ట్రం ఏపీలో విశాఖనగరం అనేక పర్యాటక ఆకర్షణలున్నాయి. వాటిని చూసేందుకు తెలంగాణతో సహా తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఓడిశా రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. అలా వచ్చినవారిలో చాలా మంది తప్పనిసరిగా అరకు అందాలు చూసే వెళుతుంటారు. 

విశాఖ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రతీరోజూ ఉదయం ఓ ప్యాసింజర్ రైలు అరకు బయలుదేరుతుంది. దానిలో అద్దాలు బిగించిన ‘విస్టా డోమ్ కోచ్’లో ప్రయాణించడం గొప్ప అనుభూతి ఇస్తుంది. ఓ పక్కన ఆకాశాన్ని అంటే కొండలు, రైల్వే స్టేషన్‌ ట్రాక్ పక్కనే అతిపెద్ద లోయలు చూసి తీరాల్సిందే. అలా వెళుతుంటే రైలు పాములా మెలికలు తిరుగుతున్నప్పుడు రైలు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కనిపిస్తుంది. ఇక ఆ కొండలను తొలిచి చేసిన గుహల గుండా రైలు ప్రయాణం మరో అద్భుతం. ఇలా అరకు చేరుకునేవరకు రైలు ప్రయాణం గొప్ప అనుభూతినిస్తుంది. 

ఇప్పుడు అరకులో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దానిలో కూర్చొని ఆకాశంలో మెల్లగా తేలిపోతూ అరకు అందాలను తవివితీరా చూడవచ్చు. 

(వీడియో : ఈనాడు సౌజన్యంతో)

Related Post