ప్రధాని మోడీ ఆదివారం సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించారు. అమెరికా విసురుతున్న సవాళ్ళను అధిగమించడానికి మన ముందున్న ఏకైక మార్గం దేశాప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడం. తద్వారా మన పరిశ్రమలను, మన రైతులను మనం కాపాడుకోగలుగుతాము. అందుకే సామాన్య, మధ్యతరగతి ప్రజలు వినియోగించే అనేక వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించాము. ఇది ఈరోజు అర్దరాత్రి నుంచే అమలులోకి వస్తుంది.
కనుక దేశ ప్రజలపై ఈ మేరకు ఆర్ధిక భారం తగ్గుతుంది. వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఈ చర్యలు ‘ఆత్మ నిర్భర్ భారత్’కు మరింత దోహదపడతాయి. ఇప్పటికే ఆదాయపన్ను పరిమితిని రూ.12 లక్షలకు పెంచి మద్య తరగతి, ఎగువ మద్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాము.
ఇప్పుడు చాలా వస్తువులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేశాము. కనుక రేపటి నుంచి నిత్యావసర సరుకులు, ఆరోగ్య భీమా సేవలు, మందులు, హోటల్స్‌లో ఆహార పదార్ధాల ధరలు భారీగా తగ్గబోతున్నాయి. జీఎస్టీతో వన్ నేషన్-వన్ టాక్స్ కార్యకర్తలు సాకారం అయ్యింది,” అని ప్రధాని మోడీ అన్నారు.