తెలంగాణలో కూడా ఓ ట్రంప్‌ ఉండేవారు....

September 19, 2025


img

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మా  తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓ ట్రంప్‌ ఉండేవారు. అయనకు రాత్రి ఏదో ఆలోచన వస్తే తెల్లారి నిద్రలేచి దానిని అమలు చేసేవారు. తెలంగాణ ట్రంప్‌ ఇష్టారాజ్యం చెస్తుండటంతో ప్రజలు ఆయనని గద్దె దించేశారు. ఇలా ఎవరు ప్రవర్తించినా ట్రంప్‌ అనుకునే పరిస్థితి ఏర్పడింది. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గురించి మాట్లాడుతూ, “ఓసారి అయన మోడీ నా మిత్రుడు అంటారు. మరోవైపు భారత్‌పై 50 శాతం సుంకాలు తప్పవని బెదిరిస్తుంటారు. ట్రంప్‌ ద్వంద వైఖరి వలన భారత్‌ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ట్రంప్‌ చివరికి విదేశీ విద్యార్ధులతో సైతం ఆడుకుంటున్నారు. కానీ ట్రంప్‌ వైఖరి కారణంగా భారతీయ విద్యార్ధులు ఉన్నత విద్యల కోసం అమెరికాకు రావడం మానుకుంటే నష్టపోయేది అమెరికన్ యూనివర్సిటీలే కదా? 

ఇంతకాలం భారతీయ విద్యార్ధులు అమెరికన్ యూనివర్సిటీలలో చదువుకునేందుకు వస్తున్నారు. కానీ ఇకపై అమెరికన్ యూనివర్సిటీలనే భారత్‌కు రప్పించుకుంటాము. ఈసారి అమెరికా పర్యటనలో కొన్ని అమెరికన్ యూనివర్సిటీలతో భేటీ అయ్యి తెలంగాణకు ఆహ్వానిస్తాను, “ అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 


Related Post