ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్‌...

September 21, 2025


img

తెలుగు సినిమాలకే హిందీ, ఇంగ్లీషు పేర్లు పెడుతున్న ఈ రోజుల్లో ఓ తమిళ సినిమాని తెలుగులో విడుదల చేస్తూ ‘ఇడ్లీ కొట్టు’ అంటూ అచ్చమైన తెలుగు పేరు పెట్టడం చాలా అభినందనీయం. కోలీవుడ్‌ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో చేసిన ఇడ్లీ కొట్టులో నిత్యా మీనన్‌ అతనికి జంటగా నటించారు. 

ఇడ్లీ కొట్టు పేరుతోనే సగం కధ చెప్పేశారు ధనుష్. కానీ ఓ పెద్ద బిజినెస్ మ్యాన్‌గా ఎదిగిన ధనుష్ ఓ గ్రామంలో ఇడ్లీ కొట్టుతో బ్రతకడంలోనే సంతృప్తి ఉందని ఎందుకు అనుకుంటాడు?దానిని నాశనం చేసి హీరోని దెబ్బ తీయడానికి విలన్లు ఆ గ్రామానికి ఎందుకు వస్తారనేది ఆసక్తి కలిగిస్తుంది. ఈ సినిమాలో సత్యరాజ్, అరుణ్ విజయ్ దేవరకొండ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్‌; కెమెరా: కిరణ్ కౌశిక్; కోరియోగ్రఫీ: సతీష్; ఆర్ట్: జాకీ, స్టంట్స్: పీటర్ హెయిన్స్ చేశారు. 

డాన్ పిక్చర్స్, వండర్‌బేర్ ఫిలిమ్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కాబోతోంది.      


Related Post

సినిమా స‌మీక్ష