ఈటీవీలో చాలా పాపులర్ ప్రోగ్రాం ‘పాడుతా తీయగా’ ద్వారా ఎంతోమంది నూతన గాయనీ గాయకులు తమ ప్రతిభని చాటుకొని సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకున్నారు. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో బాలబాలికలు చాలా ఉవ్విళ్ళూరుతూ ఆడిషన్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. వారందరికీ ఓ శుభవార్త! ఈ నెల 25 నుంచి 28 వరకు వరుసగా ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్‌లో ప్రతీరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పాడుతా తీయాగా ఆడిషన్స్ జరుగబోతున్నాయి.
ఆ వివరాలు:
సెప్టెంబర్ 25: ఖమ్మంలో
గోపాలపురం వెలుగుమట్లలోని ఈనాడు కార్యాలయంలో
సెప్టెంబర్ 26: వరంగల్‌లో
మడికొండలోని ఈనాడు కార్యాలయంలో
సెప్టెంబర్ 27: నిజామాబాద్‌లోని
బర్దీపూర్ గ్రామంలో ఈనాడు కార్యాలయంలో
సెప్టెంబర్ 28: హైదరాబాద్,
బేగంపేటలోని ఫెయిర్ ఫీల్డ్స్ మయూరీ ఆఫీసులో.