పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కన్సర్ట్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంlo అట్టహాసంగా జరిగింది. సినిమా ట్రైలర్ ఆలస్యమైన ఎట్టకేలకు విడుదల చేశారు. యాక్షన్ సినిమాల దర్శకుడుగా ముద్ర పడిన సుజీత్ దర్శకత్వంలో తీసిన సినిమా కనుక ట్రైలర్ మొత్తం అదే ఉంది.
“వాడిని కలవాలని కొందరు, వాడిని చూడాలని మరి కొందరు, వాడిని చంపాలని అందరూ ఎదురుచూస్తున్నారు.” “బొంబే వస్తున్నా తలలు జాగ్రత్త,” వంటి డైలాగులు అభిమానులను అలరించేలా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఓజీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తం విడుదల కాబోతోంది.