మేడారంలో పర్యటించిన సిఎం రేవంత్ రెడ్డి

September 23, 2025


img

సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు నేడు మేడారంలో పర్యటించి సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం సిఎం రేవంత్ రెడ్డి తులాభారంలో తన బరువుకు సమానంగా బంగారం (బెల్లం దిమ్మలు) వనదేవతలకు సమర్పించుకున్నారు.

అనంతరం సిఎం రేవంత్ రెడ్డి మేడారం ఆలయ పూజారులు, జిల్లా అధికారులతో కలిసి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు కనుక మేడారంలో జమ్పంనవాగు వద్ద స్నానాల ఘాట్‌లు, భక్తులకు వసతి సౌకర్యాలు, గద్దెల వరకు చేరుకునేందుకు విశాలమైన రోడ్లు వగైరా శాశ్విత ప్రాతిపదికన నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మేడారం చేరుకొనే అన్ని మార్గాలను కూడా అభివృద్ధి చేసి భారీ స్వాగత తోరణాలు నిర్మించాలని భావిస్తోంది.

కనుక సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి అక్కడ పర్యటించి అధికారులు, ఆలయ పూజారులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యి వాటి గురించి చర్చించారు. కనుక త్వరలోనే ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టబోతోంది. 


Related Post