మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా చేసిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా 2026, జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.... అని తెలియజేస్తూ ఇప్పటికే ఓ వీడియో వదిలారు. ఇప్పుడీ వీడియోని రేపు ఓజీ సినిమా ప్రదర్శించబోతున్న థియేటర్లలో చూడవచ్చని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది.
సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: జే.యువరాజ్ చేశారు.