అవును నిజమే... కడప జిల్లా పులివెందులలో సీఐ శంకరయ్య ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీస్ పంపించారు.
సుమారు ఆరున్నరేళ్ళ క్రితం వివేకానంద రెడ్డి దారుణ హత్య జరిగినప్పుడు సీఐగా చేస్తున్న శంకరయ్య, వైసీపీ నేతల ఒత్తిళ్ళకు తలొగ్గి ఘటనాస్థలంలో సాక్ష్యాధారాలు తుడిచేసేందుకు సాయపడ్డారని నాడు సిఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అప్పుడు ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు కూడా. కానీ జగన్ అధికారంలోకి రాగానే సస్పెన్షన్ ఎత్తివేశారు.
ఇన్నేళ్ళ తర్వాత అయన ఈ నెల 18న సిఎం చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీస్ పంపడం పలు అనుమానాలు రేకెత్నతిస్ట్లుతోంది.
నాడు చంద్రబాబు నాయుడు తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించారు కనుక సిఎం చంద్రబాబు నాయుడు దానికి పరిహారంగా రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలని లేకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవాలని దానిలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో కడప జిల్లాలో సీఐగా చేస్తున్న శంకరయ్యకు సాక్షాత్ ముఖ్యమంత్రికే లీగల్ నోటీస్ పంపడం, పరువు నష్టం కేసు వేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వార్తని టీడీపి లేదా ఏపీ ప్రభుత్వం ఇంకా ద్రువీకరించాల్సి ఉంది.