విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో జూలై 31న విడుదలైన ‘కింగ్‌డమ్’ సూపర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ, విజయ్ దేవరకొండ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ, “ఈ సినిమా చూసిన తర్వాత మమ్మల్ని చాలా మంది ఇక్కడ తప్పకుండా హీరోకి ఎలివేషన్స్ ఉంటుందని అనుకున్నాము కానీ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయామని చెప్పారు. కొందరు హీరోని ఆవిధంగా ఎందుకు తగ్గించి చూపారని మమ్మల్ని అడుగుతున్నారు.
నిజమే ఈ సినిమాలో హీరోకి ఎలివేషన్స్ ఇవ్వడం ద్వారా కమర్షియల్ ఎలిమెంట్ జోడించే అవకాశం ఉంది. కానీ జెర్సీ వంటి క్లాసిక్ సినిమా తీసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి ఈ సినిమా అప్పజేప్పినప్పుడు ఆయన అనుకున్నట్లే సినిమా తీయడం మంచిదనుకున్నాము. అందుకే ఆయనపై ఒత్తిడి చేయకుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. అందుకే ఆయన ఈ సినిమాని ఇంత బాగా తీసి హిట్ అందించారు.
ఆయన ఆలోచన ప్రకారం హీరో సహజంగా కోపం, ఆవేశం వచ్చినప్పుడే అది ప్రదర్శించాలి తప్ప ఎలివేషన్స్ కోసం ప్రదర్శిస్తే అది ఎబ్బెట్టుగా ఉంటుందన్నారు. మాకు అయన ఆలోచన సరైనదేననిపించడంతో ఆయనకు నచ్చినట్లు సినిమా తీసేందుకు సహకరించాము,” అని చెప్పారు.