ప్రియదర్శి ప్రేమంటే... ట్రైలర్‌ చూశారా?

November 18, 2025


img

శ్రీరామ్‌ దర్శకత్వంలో ప్రియదర్శి, అనంది, సుమ ప్రధాన పాత్రలలో నటించిన ‘ప్రేమంటే’ ట్రైలర్‌ విడుదలయ్యింది. ప్రియదర్శి కామెడీ సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు. దానిలో యాంకర్ సుమ కానిస్టేబుల్ వేషం వేస్తే, ఆమె బాస్‌గా వెన్నెల కిషోర్‌ నటిస్తే ఆ కామెడీ ఎలా ఉంటుందో ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్‌, సంగీతం: లియాన్ జేమ్స్, కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, ఎడిటింగ్: రవిచంద్ర తిరున్, ఆర్ట్: అరవింద్ ములే చేస్తున్నారు.  

స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కుర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్‌ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 21న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష