అడ్లూరి-పొన్నం వివాదం సుఖాంతం!

October 08, 2025


img

తెలంగాణ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‌ మద్య మొదలైన వివాదం టీకప్పులో తుఫానులా ముగిసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ నివాసంలో నేడు సమావేశమైనప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తాను అడ్లూరి గురించి చెడుగా మాట్లాడలేదని కానీ మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఆయన బాధ పడ్డారని తెలిసిందన్నారు. ఆయన మనసుకి బాధ కలిగించినందుకు పొన్నం ప్రభాకర్‌ క్షమాపణలు చెప్పారు. తాను అందరినీ కలుపుకుపోయే సంస్కృతి గల కాంగ్రెస్‌ పార్టీలో పుట్టి పెరిగినవాడినని కనుక ఎవరిని నొప్పించాలని అనుకోనన్నారు. తనకు పార్టీ శ్రేయస్సు ముఖ్యమన్నారు. సామాజిక న్యాయం కోసం అడ్లూరితో కలిసి పనిచేస్తానన్నారు. 

అడ్లూరి కూడా వెనక్కు తగ్గి ఇక్కడితో ఈ సమస్య ముగిసిపోయిందని, ఎప్పటిలాగే మళ్ళీ అందరం కలిసి పనిచేస్తామన్నారు. కనుక తన శ్రేయోభిలాషులందరూ కూడా సంయమనం పాటించి ఇక్కడితో ఈ సమస్యని మరిచిపోవాలని అడ్లూరి లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.


Related Post