భారత్‌కు మొట్ట మొదట మొబైల్ ఫోన్లు పరిచయం చేసిన కంపెనీలలో నోకియా ఒకటి. ప్రస్తుతం చైనా కంపెనీలతో పోటీ పడలేక మొబైల్ రేసులో వెనకబడినప్పటికీ. నేటికీ నోకియా అంటే తిరుగులేని ఫోన్ అని భారతీయుల నమ్మకం అలాగే నిలిచి ఉంది.
తాజాగా నోకియా ‘హెచ్ఎండీ టచ్’ పేరుతో 4జీ ఫోన్ భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీనిలో 3.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంది. పెద్ద ఆండ్రాయిడ్ టచ్ ఫోన్‌లో ఉన్న వీడియో కాలింగ్, వైఫై వంటి ఫీచర్స్ దాదాపు అన్నీ దీనిలో కూడా ఉన్నాయి. 2,000 ఎంఏ హెచ్ బ్యాటరీతో ఉండే ఈ బుల్లి టచ్ ఫోన్ ధర రూ.3,999లు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్‌లైన్ పోర్టల్స్, బయట మొబైల్ దుకాణాలలో కూడా ఈ ఫోన్ అక్టోబర్ 9 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి.