ఆపరేషన్ సింధూర్ 2.0 ఇంకా మిగిలే ఉంది!

October 03, 2025


img

భారత్‌ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఓ బాంబులాంటి మాట చెప్పారు. నేడు రాజస్థాన్‌లోని అనూప్ ఘడ్‌లో ఆర్మీ బోర్డర్ చెక్ పోస్టుని సందర్శించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “ ఆపరేషన్ సింధూర్‌తో భారత్‌ సత్తా ఏమిటో పాకిస్తాన్‌కు రుచి చూపాము. కానీ నేటికీ పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్‌కు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తూనే ఉంది. ఇప్పటికైనా పాకిస్తాన్ తమ దేశంలో ఉగ్రవాద శిభిరాలను ధ్వంసం చేస్తే మంచిది. లేకుంటే ఆపరేషన్ సింధూర్ 2.0 చేపట్టాల్సి వస్తుంది. ఈసారి దాడి చేస్తే ప్రపంచ పటంలో నుంచి పాకిస్తాన్ కనపడదు,” అని హెచ్చరించారు. 

ఆపరేషన్ సింధూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్చ ఇచ్చిందని అందువల్లే అంత అవలీలగా, అంత తక్కువ సమయంలో పాక్‌పై భీకర దాడులు చేసి లొంగదీశామని చెప్పారు. ఆ సమయంలో పాక్ ఏవిదంగా ప్రతిస్పందిస్తుందో ఊహిస్తూ అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించి అమలుచేసి విజయం సాధించామని భారత్‌ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు.


Related Post