కామ్రేడ్ కళ్యాణ్‌గా వస్తున్న శ్రీ విష్ణు

October 02, 2025


img

నేడు దసరా పండగ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 12.06 గంటలకు శ్రీ విష్ణు 19వ సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్‌ కామ్రేడ్ కళ్యాణ్. ఇది 1992లో జరిగిన కధగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు నక్సలైట్‌గా నటిస్తున్నారు. 

స్కందవాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కుమారి కర్నాటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించి షూటింగ్ మొదలుపెట్టారు.
  
ఈ సినిమాకు దర్శకత్వం: జానకీ రామ్‌ మారెళ్ళ, కధ: భాబు భోగవరపు, డైలాగ్స్: నందు సరవిగాన, సంగీతం: విజయ్ బుల్‌గనిన్, కెమెరా: సాయి రామ్ చరణ్‌, స్టంట్స్: పృధ్వీ మాస్టర్, ఏ విజయ్, రామ్ చరణ్‌ కృష్ణన్ మాస్టర్, ఎడిటింగ్: చోటా కే ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్ చేస్తున్నారు.

Related Post

సినిమా స‌మీక్ష