సినీ పరిశ్రమలో మరో జంట విడాకులు

October 01, 2025
img

సినీ పరిశ్రమలో ఏటా కనీసం రెండు మూడు జంటలు విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌, సైంధవి దంపతులు విడాకులు తీసుకున్నారు. ఇద్దరికీ మద్య మనస్పర్ధలు పెరిగిపోవడంతో పరస్పర అంగీకారంతో మద్రాస్ కోర్టులో విడాకులు తీసుకున్నారు.

వారిరువురూ ఒకప్పుడు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచే వారి మద్య స్నేహం ఉంది. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో 2013లో పెళ్ళి చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. 

జీవీ ప్రకాష్ కుమార్‌ మంచి సంగీత దర్శకుడే కాక మంచి నటుడు కూడా. పలు సినిమాలలో నటించారు. కనుక నటుడుగా, సంగీత దర్శకుడుగా పనిచేస్తున్న ఆయనపై పని ఒత్తిడి చాలా ఎక్కువగానే ఉంటుంది.

దాని కారణంగానే దంపతుల మద్య గొడవలు మొదలై ఉండవచ్చు. లేదా అయన ఇండస్ట్రీలో వేరేవారితోనైనా సన్నిహితంగా ఉంటున్నారేమో? కారణం ఏదైనప్పటికీ 12 ఏళ్ళు కలిసి జీవించిన తర్వాత విడిపోవడం చాలా బాధాకరమే! 

Related Post