మన బతుకమ్మకి రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డ్స్

September 30, 2025
img

సోమవారం సరూర్ నగర్‌ మైదానంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ పండగలో ఆడిపాడిన మహిళలు తెలంగాణ రాష్ట్రానికి రెండు గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులు సాధించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 64 అడుగుల ఎత్తైన బతుకమ్మ ప్రపంచలోకెల్లా అత్యంత ఎత్తైన బతుకమ్మగా ఓ రికార్డ్ సాధించగా, బతుకమ్మ చుట్టూ లయబద్దంగా తిరుగుతూ ఆడిపాడిన 1400 మందికి పైగా మహిళలు ప్రపంచంలో కెల్లా అతిపెద్ద జానపద నృత్యంగా మరో గిన్నిస్ రికార్డ్ సాధించారు. 

దీని కోసం పర్యాటక శాఖ రెండుమూడు వారాల ముందుగానే ఏర్పాట్లు మొదలు పెట్టింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల నుంచి 200 బస్సులలో మహిళలను రప్పించి వారికి సకల సౌకర్యాలు కల్పించి బతుకమ్మ ఆటపాటలలో శిక్షణ ఇప్పించింది. బాగా నేర్చుకున్న తర్వాత వారందరూ ముందుగా అనేకమార్లు రిహార్సల్స్ చేశారు. సోమవారం సాయంత్రం గిన్నిస్ ప్రతినిధుల సమక్షంలో వారందరూ 64 అడుగుల బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. ప్రపంచ రికార్డ్ సాధించి తెలంగాణ ప్రతిష్టని ఇనుమడింపజేశారు. 

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రెండు అవార్డులలో ఒకటి ప్రభుత్వం తరపున మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్కలు అందుకోగా, మరొకటి వారి సమక్షంలో మహిళలు అందుకున్నారు. 

Related Post