ఓజీ... నేహాశెట్టి పాట కలిపారు తెలుసా?

October 01, 2025


img

సుజీత్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన ‘ఓజీ’ సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని దూసుకుపోతోంది. ఈ సినిమాలో నేహాశెట్టి కూడా ఉందని చెప్పారు. కానీ సినిమాలో కనపడలేదు. నేటి నుంచి ఆమె కూడా కనిపించబోతోంది.

‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్...’ అంటూ సాగే ఓ ఐటెం సాంగ్ ఆమె చేసింది. సినిమా రిలీజ్ చేసే సమయానికి దాని ఎడిటింగ్ పూర్తి కాకపోవడం వలన సినిమాలో ఆ పాట పెట్టలేదు. ఎడిట్ చేసి దానిని సినిమాకి జోడించామని చిత్ర బృందం తెలిపింది. కనుక నేటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఓజీ ప్రదర్శించబడుతున్న అన్ని థియేటర్లలో నేహాశెట్టి ఐటెం సాంగ్ చూసి ఆనందించవచ్చని తెలిపింది. 

ఓజీలో పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా ప్రియాంక మోహన్ చేయాగా బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్‌ ఉత్తమన్, అభిమన్యు సింగ్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఓజీ సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తం విడుదలయింది. 


Related Post

సినిమా స‌మీక్ష