కాంతార ఛాప్టర్ 1: మరోపాట విడుదల

October 01, 2025


img

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో చేసిన ‘కాంతార’కు సీక్వెల్‌గా ‘కాంతార: ఛాప్టర్ 1’ నుంచి ఇటీవల విడుదల చేసిన ‘బ్రహ్మ కలశ’ శివ భక్తి గీతానికి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరోపాట విడుదల చేశారు.  . కృష్ణకాంత్ వ్రాసిన ఈ పాటని అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచి సంగీతం అందించగా, కాళేశ్వరం ప్రాజెక్టు భైరవ పాడారు.     

‘కాంతార: ఛాప్టర్ 1’లో రిషబ్ శెట్టికి జంటగా రుక్మిణీ వసంత్ నటించగా జయరాం, రాకేశ్ పూజారి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రిషబ్‌ శెట్టి; సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్; సినిమాటోగ్రఫీ: అరవింద్‌ ఎస్‌ కశ్యప్‌ చేశారు.  

హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ‘కాంతార: ఛాప్టర్ 1’ రేపు (అక్టోబర్ 2) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘కాంతార: ఛాప్టర్ 1’ సినిమాని బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/hamDXkFeu0k?si=jvSRW0hjpS5Gjpw6" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>


Related Post

సినిమా స‌మీక్ష