గుని మంచికంటి దర్శకత్వంలో ‘బాబా బ్లాక్ షీప్’ అనే కొత్త సినిమా తెరకెక్కబోతోంది. చిత్రాలయ స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ సినిమాలో టిన్ను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మారియన్, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, కార్తేకేయ, విస్మయ శ్రీ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలియజేస్తూ ఓ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇది ఒక రోజులో సాగే క్రైం కామెడీ సినిమా అని మోషన్ పోస్టర్‌లో చెప్పారు.