నూతన దర్శకుడు కేపీ రోహిత్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపధ్యంలో తీస్తున్న ఈ యాక్షన్ చిత్రం నుంచి నిన్న దసరా పండగ సందర్భంగా ప్రీ-గ్లిమ్స్ విడుదల చేశారు. ఈ నెల 25న విడుదల కాబోతోంది.
ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ళ ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: రోహిత్ కేపీ; సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్; కెమెరా: వట్రివేల్ పళనిసామి; ఎడిటింగ్: నవీన్ విజయ్ కృష్ణ చేశారు.
ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాని కె నిరంజన్ రెడ్డి, చాతన్య రెడ్డి కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.