ఫలక్‌నూమా ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం

October 03, 2025


img

మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి శుక్రవారం ఉదయం ఫలక్‌నూమా ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సం చేశారు. ఈ కార్యక్రమంలో మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ కమీషనర్, అధికారులు పాల్గొన్నారు. 

రూ.52.03 కోట్లు వ్యయంతో నాలుగు లేన్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ నేటి నుంచి అందుబాటులోకి రావడంతో నిత్యం బర్‌కాంగ్రెస్‌ జంక్షన్ (జీ-మాక్స్ కన్వెన్షన్‌)-ఫలక్‌నూమా బస్ డిపో- ఫలక్‌నూమా రైల్వే స్టేషన్‌, గ్లోబల్ స్కూల్, కాళీ మాత మందిర్, చార్మినార్ మద్య రాకపోకలు సాగించే వాహనదారులకి ట్రాఫిక్ సమస్యలు లేకుండా హాయిగా దూసుకుపోవచ్చు. 


Related Post