మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు గత నెల 10న బాబు పుట్టాడు. అప్పుడే మూడు వారాలు పూర్తవడంతో బాబుకి బారసాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామి దయతో జన్మించిన తమ బాబుకి వాయువ్ తేజ్ కొణిదెల అని నామకారణం చేశామని, బాబుకి మీ అందరి దీవెనలు కావాలంటూ సోషల్ మీడియాలో వారు కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు.
2017లో ‘మిస్టర్’ సినిమాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారిగా కలిసి నటించారు. అప్పటి నుంచే వారి మద్య ప్రేమ కలిగింది. ఇరు కుటుంబాల పెద్దల ఆసీసులతో 2023, నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో పెళ్ళి (డెస్టినేషన్ వెడ్డింగ్) చేసుకున్నారు.
Our greatest blessing now has a name.🤍 pic.twitter.com/sGEk9HzBuc