విమల్ కృష్ణ ‘డిజే టిల్లు’తో ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకులలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. నిన్న విజయ దశమి సందర్భంగా కొత్త సినిమా ‘అనుమాన పక్షి’కి కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేశారు.
ఈ సినిమాతో కొత్త హీరో, హీరోయిన్లు రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్‌లను పరిచయం చేస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దంద్ కలిసి నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో బ్రహ్మాజీ, అనన్యా, చారిత్, సుప్రీత్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: విమల్ రామకృష్ణ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: సునీల్ కుమార్ నామా, ఎడిటింగ్: అభినవ్ కూనపరెడ్డి, ఆర్ట్: జేకే మూర్తి చేస్తున్నారు.
Taking off the wings of doubt… the madness begins! 🦜 🔥
— Chilaka Productions (@chilakaprod) October 2, 2025
Starring #RagMayur in and as #AnumanaPakshi 💥
From the man who gave us #DJTillu @K13Vimal comes with a whole new ride of chaos and fun.🤩 #HappyDussehra pic.twitter.com/KhAov4efRH