దసరాకు ఆయుధపూజ చేయడం ఆనవాయితీ కనుక ఈసారి సినీ పరిశ్రమలో తెరకెక్కుతున్న యాక్షన్, క్రైమ్ సినిమాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కటి పోస్టర్స్, టీజర్స్ విడుదల వేశాయి.
కోలీవుడు హీరో విశాల్ ‘మకుటం’ అనే యాక్షన్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆయుధ పూజ అంటూ రివాల్వర్ ఫైర్ చేస్తున్న ఓ చేతిని పోస్టర్‌గా వేశారు. ఆ పోస్టర్‌తోనే ఇదొక మూడు నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఓ గ్యాంగ్ స్టర్లేదా ఫ్యాక్షన్ లేదా నక్సలైట్ స్టోరీ అని చెప్పేశారు దర్శకుడు రవి అరసు.
వినాయక చవితి పండగకు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విశాల్ రౌడీ, బిజినెస్ మ్యాన్, ఉద్యోగిగా మూడు వేర్వేరు రూపాలలో చూపారు. కనుక ఈ సినిమాలో విశాల్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు భావించవచ్చు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: రవి అరసు; డైలాగ్స్: రాజేష్ ఏ మూర్తి; సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్; కెమెరా: రిచర్డ్ ఎమ్మెల్యేలు మదన్, ఆర్ట్: జి.దూరి రాజ్; ఎడిటింగ్: ఎన్బీ శ్రీకాంత్; స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్ చేస్తున్నారు.
సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆర్.బీ. చౌదరి మకుటం సినిమాని తమిళ్, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు.