కేంద్ర ఎన్నికల కమీషన్ సోమవారం బీహార్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. వీటితో దేశవ్యాప్తంగా తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాలలో ఉప ఎన్నికలు కూడా నిర్వహించబోతోంది. బీహార్ శాసనసభ రెండో దశ ఎన్నికలతో పాటు నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించబోతోంది.
కనుక రెండో దశ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్: అక్టోబర్ 13; నామినేషన్స్ గడువు: అక్టోబర్ 20; నామినేషన్స్ పరిశీలన: అక్టోబర్ 21; నామినేషన్స్ ఉపసంహరణ: అక్టోబర్ 23; పోలింగ్: నవంబర్ 11, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి నవంబర్ 14న ఖరారు అయ్యింది.
ఈ ఉప ఎన్నికలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి రవీంద్ర నాథ్ ఆకస్మిక మృతితో జరుగుతున్నవి కనుక ఆయన భార్య మాగంటి సునీతని బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్ధిగా ఖరారు చేసింది. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేసింది.
కానీ కాంగ్రెస్, బీజేపిలు ఇంకా తమ అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది కనుక రెండు పార్టీలలో ఆశావాహుల నుంచి వాటి అధిష్టానంపై ఒత్తిడి పెరిగిపోతుంది. కనుక త్వరలోనే అవి కూడా తమ అభ్యర్ధులను ప్రకటించవచ్చు.