బాలకృష్ణ 111వ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం

October 08, 2025

img

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరోలందరూ కూడబలుక్కునట్లు ఒకేసారి జోరు పెంచారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర పూర్తికాగానే అనిల్ రావిపూడితో మన శంకర ప్రసాద్ గారు సినిమా మొదలుపెట్టి సంక్రాతికి వస్తున్నారు.

మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ‘కుబేర’తో హిట్ కొట్టి తన 100వ సినిమా ‘కింగ్ 100’కి అన్నపూర్ణ స్టూడియోలో కొబ్బరికాయ కొట్టేశారు.

మరో సీనియర్ హీరో బాలకృష్ణ అఖండ 2: తాండవం పూర్తి చేసి వెంటనే 111వ సినిమా మొదలుపెట్టేందుకు సిద్దమైపోతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 24 నుంచే ప్రారంభం కాబోతోంది. నవంబర్‌ నెలాఖరులోగా మొదటి షెడ్యూల్ షూటింగ్‌ పూర్తిచేయాలని గోపీచంద్ మలినేని ప్లాన్ చేసుకున్నారు.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు చారిత్రిక నేపధ్యంతో నిర్మించబోతున్న ఈ సినిమాకు ‘కాంతార’కు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కాశ్యప్ పనిచేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల కాబోతోంది.

THE GOD OF MASSES is back… and this time, we’re ROARING LOUDER! 🦁🔥

Honoured to reunite with #NandamuriBalakrishna garu for our 2nd MASS CELEBRATION together — #NBK111 👑

This one’s going to be HISTORIC! 💥

Backed by the passionate force #VenkataSatishKilaru garu under… pic.twitter.com/1bRWPX83J0
— Gopichandh Malineni (@megopichand) June 8, 2025

Related Post

సినిమా స‌మీక్ష