ప్రముఖ నటి సమంత తన సొంత సినీ నిర్మాణ సంస్థ బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ ఏర్పాటు చేసుకొని తాను ప్రధాన పాత్రలో ‘మా ఇంటి బంగారం’ సినిమా చేయబోతున్నట్లు ప్రకటింఛి టైటిల్ పోస్టర్ కూడా వేశారు.
దాని తర్వాత మొదలుపెట్టిన ‘శుభం’ విడుదలయ్యి ఓటీటీ మీదుగా వెళ్ళిపోయింది కూడా. కానీ ఇంతవరకు ‘మా ఇంటి బంగారం’ ఏమైందో తెలీదు. ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహించబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం ఓ వార్త వినపడింది. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా ప్రస్తావన ఎక్కడా వినపడలేదు.
కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని ఈ అక్టోబర్ నెలాఖరులోగా షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తాజా సమాచారం. కనుక త్వరలో ఈ సినిమాకి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా 1980 దశాబ్దం నాటి మహిళల పరిస్థితిని ప్రతిబింబిస్తూ సాగే ఓ క్రైమ్ థ్రిల్లర్ అని టైటిల్ లుక్ పోస్టర్‌లోనే చెప్పేశారు.