జూబ్లీహిల్స్‌ టికెట్ కోసం నలుగురు పోటీ

October 05, 2025


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు నేడు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం గాంధీ భవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో నలుగురి పేర్లు ఖరారు చేసి అధిష్టానం ఆమోదం కోసం పంపించబోతోంది.

నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, అంజన్ కుమార్‌ యాదవ్, బొంతు రామ్మోహన్ పేర్లను జాబితాలో చేర్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం సాయంత్రం ఈ జాబితా పట్టుకొని ఢిల్లీ బయలుదేరుతున్నారు.

బీసీ రిజర్వేషన్స్‌పి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపబోతోంది. కనుక ఈసారి వీరి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. 

తాజా సమాచారం ప్రకారం ఎమ్మెల్సీ సీటు పొందిన మహమ్మద్ అజారుద్దీన్ కూడా మళ్ళీ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకుంటున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ  పీసీసీ ఖరారు చేసిన జాబితాలో ఆయన పేరు చేర్చలేదు కనుక ఆయనకు అవకాశం లేనట్లే! 


Related Post